అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తమైంది. మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్నారు.
Fire Accident : జార్జియాలో సోమవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. పిల్లలు 6, 12, 13 సంవత్సరాల వయస్సు గలవారని కోవెటా కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచేత్తుతున్నాయి.. అనేక నగరాలు నీటిలో మునిగాయి.. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలను కోల్పోయారు.. తెలుగు రాష్ట్రాల్లో వరదల్లో కొట్టుకు పోయి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. పొరుగు రాష్ట్రమైన అస్సాం పరిస్థితి వరదల కారణంగా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు వరుస రోడ్డు ప్రమాదాలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. అసోంలోని తిన్‌సుకియా జిల్లాలో జరిగిన…
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది కారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. శంషాబాద్…
ఓఆర్ఆర్ నుంచి కోదాడ వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. కారు వెనుకనుండి ఢీకొట్టింది లారీ. వాళ్లని హాస్పటల్ కు తరలించే సమయంలో మరో కారు ఆగింది. అంతేకాదు, ఆ కారు వచ్చి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. గాయపడ్డవారు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.…