లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. ఈ దశలో, 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు నమోదు చేయనున్నారు. ఈ దశలో 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. వారిలో 120 మంది మహిళలు ఉన్నారు.