మార్చి 18 నుంచి 20 వరకు మొత్తం 36 ఎంఎంటీఎస్ సర్వీసులు నడపబడవని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు తెలియజేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తొమ్మిది సర్వీసులు రైలు నెం. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139 మరియు 47140, రద్దు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో తొమ్మిది సర్వీసులు – 447105,147109,47110, 47111, 47112, 47114, 47116, 47118 మరియు 47120 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సర్వీసుల రద్దులో లింగంపల్లి-ఫలక్‌నుమాలో…