(జనవరి 10తో చంటికి 30 ఏళ్ళు)చంటి పిల్లలంటే జనానికి భలే ఇష్టం. అలాగే చంటిఅన్న పేరు కూడా తెలుగువారికి ఎంతో ఇష్టమైనది. అదే తీరున చంటి అన్న పేరుతో తెలుగునాట తెరకెక్కిన తొలి చిత్రాన్ని జనం విశేషంగా ఆదరించారు. వెంకటేశ్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మించిన చంటి చిత్రం 1992 జనవరి 10న విడుదలై సంక్రాంతి సంబరాల్లో విజేతగా నిలచింది. వెంకటేశ్ ను తన తరం హీరోల్లో రీమేక్స్ కింగ్గా నిలిపిన చిత్రం కూడా…