ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా…