మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది.