ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు రాయలచెరువు లీకేజీలతో తిరుపతి జనం కంటిమీద కునుకులేకుండా పోతోంది. తాజాగా ఓ పాత భవనం కుప్పకూలింది. తిరుపతి భవానీ నగర్ లో కుప్పకూలింది మూడంతస్థుల భవనం. వర్షాలకు పది రోజులుగా పాత భవనం నానిపోయింది. శిథిలావస్ధకు చేరడంతో రెండేళ్ళ క్రితమే ఇంటిని ఖాళీచేశాడు యాజమాని. ఇంటిలో, సమీప ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇదిలా వుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తి,సత్యవేడు,…