భారత్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ హరారే వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలి టీ-20 మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో షాక్ తిన్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. జింబాబ్వే బౌలర్లను తేలిగ్గా తీసుకున్నారో, పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారో కానీ తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తేలిపోయారు.