భారత స్టార్ షూటర్ మను భాకర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. శుక్రవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి ఇషా సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇషా క్వాలిఫికేషన్‌లో 18వ స్థానంలో నిలిచింది.