25 Years Of Pelli: హీరోగా వడ్డే నవీన్ కు, నాయికగా మహేశ్వరికి, విలన్ గా పృథ్వీరాజ్ కు పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘పెళ్ళి’. శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్. రామలింగేశ్వరరావు నిర్మించిన ‘పెళ్ళి’ 1997 ఆగస్టు 8న విడుదలై ఘనవిజయం సాధించింది. అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్ళలాగా మెలిగేవారు తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. కోడలి భవిష్యత్ కోసం కొడుకునే విడనాడిన అత్తలు కూడా ఉంటారని గతంలో కొన్ని సినిమాలు చూపించాయి.…