(ఆగస్టు 2న వినోదం చిత్రానికి పాతికేళ్ళు)సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపొందిస్తూ సంసారపక్షంగా సాగి, సెన్సార్ కత్తెరకు పనిలేకుండా చేసిన ఘనుడు దర్శక, సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. జనానికి వినోదం పంచడమే ధ్యేయంగా కృష్ణారెడ్డి చిత్రాలు సాగాయి. కొన్ని చిత్రాలలో కరుణరసం చోటు చేసుకున్నా, కృష్ణారెడ్డి సినిమా అంటే వినోదమే ప్రధానమని చెప్పవచ్చు. అందువల్లే శ్రీకాంత్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తొలి చిత్రానికి వినోదం అనే టైటిల్ ను పెట్టారనిపిస్తుంది. అంతకుముందు కృష్ణారెడ్డి…