Hyderabad Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ అప్డేట్ వచ్చిన కొన్ని గంటల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తోంది. ఎల్బినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. హయత్ నగర్‌లో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది.