22 మంది డాక్టర్లు, నర్సులపై చర్యలు చేపట్టేందుకు విచారణకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన నిర్వాహకాలపై చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి, 2020లో ఏసీబి ఆకస్మిక తనిఖీలో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జూన్ లో ఏసీబీ అధికారులిచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న మంత్రి చర్యలకు ఆదేశించారు. అవినీతి, పాలన వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాల్ని గుర్తించారు. ఇన్‌పేషెంట్లపై తప్పుడు లెక్కలు.. మందుల వినియోగాన్ని సరిగా చూపని నర్సులు.. గత ప్రభుత్వ హయాంలో…