మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయులకు భారీ షాక్‌నిచ్చింది. అక్టోబర్‌లో సుమారు ఇరవై లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది. అభ్యంతరకర ప్రవర్తన పేరుతో, అందిన ఫిర్యాదుల మేరకు అకౌంట్లను సమీక్షించి నిషేధం విధించినట్లు వాట్సాప్ ప్రకటించింది. కాగా, సెప్టెంబర్‌లో సుమారు 30 లక్షల ఖాతాలను ఈ యాప్ తొలగించింది. అయితే అభ్యంతరకర ప్రవర్తన పేరుతో (గ్రూప్‌లలో అభ్యంతరకర యాక్టివిటీస్ ద్వారా) తొలగించిన అకౌంట్లు ఈసారి ఎక్కువ రికార్డు కావడం గమనార్హం. వీటి ద్వారా ఎలాంటి సమాచారం వ్యాప్తి…