సంక్రాంతి అంటేనే సినిమా సీజన్. ఏ హీరో అయినా, నిర్మాత అయిన తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. టాక్‌తో సంబంధం లేకుండా సంక్రాంతి సినిమాలకు వసూళ్లు వచ్చేస్తాయి. అందుకే ఈసారి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగార్జున,వెంకటేశ్, మహేశ్ బాబుతో పాటు చిన్న హీరో సజ్జూ తేజ కూడా సంక్రాంతికి సై అన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరు కారం’, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’…
సంక్రాంతి సీజన్ వస్తుంది అంటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ విషయంలో రచ్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటిలాగే 2024 సంక్రాంతికి కూడా సినిమాల హీట్ పెరుగుతూ ఉంది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్, ఏ మూవీ వెనక్కి వెళ్తుంది? ఇలా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పండగ సెలవలు ఉంటాయి కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి…
ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.. ఇక స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.. 2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. ఎన్నో హిట్ సినిమాలు సంక్రాంతికి విడుదలైన బాక్సఫీస్ ను షేక్ చేశాయి.. ఇక 2024 సంక్రాంతి ఫైట్…