సంక్రాంతి అంటేనే సినిమా సీజన్. ఏ హీరో అయినా, నిర్మాత అయిన తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. టాక్‌తో సంబంధం లేకుండా సంక్రాంతి సినిమాలకు వసూళ్లు వచ్చేస్తాయి. అందుకే ఈసారి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగార్జున,వెంకటేశ్, మహేశ్ బాబుతో పాటు చిన్న హీరో సజ్జూ తేజ కూడా సంక్రాంతికి సై అన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరు కారం’, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’ జనవరి 12న విడుదలవగా… జనవరి 13న వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ విడుదలయింది. ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఇక చివరగా జనవరి 14న నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ రిలీజ్ అయింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారాడు.
ఇక ఈ సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరు? అంటే, హనుమాన్ అనే అంటున్నారు. సినిమాకు పెట్టిన్ ఖర్చు, వచ్చిన వసూళ్లు, సినిమా కంటెంట్ లాంటి విషయాల్లో విన్నర్‌గా నిలబడింది. హనుమాన్ సంక్రాంతి పోరులో గెలిచిన పందెం కోడి అవ్వగా… సెకండ్ ప్లేస్ లో కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా ఉంది. లేట్ గా రిలీజైన ఈ మూవీ ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయిపొయింది. కొన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవనున్న నా సామిరంగ సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది. మూడో స్థానంలో గుంటూరు కారం సినిమా నిలిచింది. 100 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా టాక్ కి భిన్నంగా కలెక్షన్స్ ని రాబడుతుంది కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ కి కాస్త దూరంలోనే ఉంది.
ఈ వీక్ కూడా గుంటూరు కారం స్ట్రాంగ్ గా నిలబడితేనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుంది. ఇక సంక్రాంతి సినిమాల్లో చివరి స్థానంలో నిలిచింది సైంధవ్ సినిమా. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీంతో అన్ని సెంటర్స్ లో నష్టాలను ఫేస్ చేస్తోంది. సో ఓవరాల్ గా ఇది సంక్రాంతి సినిమాల రిజల్ట్స్. మరి లాంగ్ రన్ లో హనుమాన్, నా సామిరంగ సినిమాలు ఎంత లాభం తెస్తాయి? గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుతుందా లేదా అనేది చూడాలి.