2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతటి గొప్ప విజయం సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కడే క్రికెట్‌లో కొనసాగుతుండటం గమనార్హం. మిగతా క్రికెటర్లందరూ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇటీవల శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం ప్రపంచకప్ విన్నింగ్ టీమ్‌లో కోహ్లీ ఒక్కడే మిగిలాడు.…