అద్భుతమైన నటనతోనో, జాతీయ అవార్డులతోనో లేదంటే కాంట్రవర్సీలతోనో వార్తల్లో ఉంటుంది కంగనా రనౌత్. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా పచ్చనైన సందేశంతో నెటిజన్స్ ముందుకొచ్చింది. కంగనా 20 చెట్లు నాటింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, చిన్నపాటి సందేశాన్ని కూడా తన ఫాలోయర్స్ కి ఇచ్చింది ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్…ఈ మధ్య వచ్చిన తౌక్టే తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ లో కల్లోలం సృష్టించింది. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు,…