నైరుతి రుతుపవనాల నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని 2 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 10 జిలా్లలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లోని తీర ప్రాంతాల్లో రానున్న 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.