కర్ణాటకలోని హోస్పేట్లో గల తుంగభద్ర జలాశయం ఉన్న 33 గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వాస్తవంగా తుంగభద్ర జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో.. కర్ణాటక అధికారులు తలలు పట్టుకున్నారు.