బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపడం అనేది కాస్తంత ఆలస్యంగా జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులు అత్యధికంగా ఓటు వేసిన నేపథ్యంలో లోబో ఎవిక్ట్ అయ్యాడని ప్రకటించిన నాగార్జున అతన్ని సీక్రెట్ రూమ్ లోకి పంపడం శనివారం నాటి కొసమెరుపు. ఈ వారం ఏకంగా 10మంది సభ్యులు నామినేషన్స్ లో ఉండగా, శనివారం నామినేషన్స్ కు సంబంధించి ఎవరు సేవ్ అయ్యారో చెప్పకుండా నాగార్జున కొత్త ఆట మొదలెట్టాడు.…