రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. తొమ్మిది వేర్వేరు రష్యన్ ప్రాంతాలలో 144 డ్రోన్‌లను ప్రయోగించింది. మాస్కోలో 20 డ్రోన్లతో దాడి చేసింది.