నోయల్, విశాఖ ధీమాన్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ’14’. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయన, ఎన్. శివకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు టీజర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”నోయల్ కు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ దక్కాలి. అతనితో నాది 15 సంవత్సరాల అనుబంధం. అప్పట్లో…