నోయల్ ’14’ మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయల్, విశాఖ ధీమాన్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ’14’. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయన, ఎన్. శివకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు టీజర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”నోయల్ కు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ దక్కాలి. అతనితో నాది 15 సంవత్సరాల అనుబంధం. అప్పట్లో అందరం కలిసి, సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం. ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబుల్ అయ్యేవాళ్ళం. ఫిలింనగర్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే, అంతా కలిసి బైక్స్ మీదో కారులోనో వచ్చే వాళ్ళం. నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది” అని అన్నారు.
Read Also : బాలకృష్ణతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
నిర్మాత సుబ్బారావు రాయన మాట్లాడుతూ, ”దుర్గాష్టమి రోజు మా టీజర్ విడుదల చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు మాకు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ మూవీ నిర్మించడానికి ముందుకు వచ్చాం. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ విష్ణు గారు మాకు అవకాశం ఇస్తే తనతో కూడా మేం మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. హీరో నోయల్ మాట్లాడుతూ, ”ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద వున్నాను అంటే దానికి కారణం రాజమౌళి, సుకుమార్ గార్లు. వాళ్లకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పిన సరిపోదు. శ్రీ విష్ణు ఉండే స్థాయికి ఈ కార్యక్రమానికి అతను రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఫోన్ చేయగానే వచ్చాడు. ఆ రోజుల్లో మాట్లాడిన విష్ణుకి ఇప్పుడు మాట్లాడే విష్ణుకి తేడా ఏమీ లేదు. నాకు కొంచెం పొగరు వచ్చిందేమో కాని శ్రీవిష్ణు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అలానే మూవీ డిఫరెంట్ గా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డిఓపి సాయి గారు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చూపించారు” అని అన్నారు.
ప్రవీణ్ సత్తారు, కరుణాకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన లక్ష్మీ శ్రీనివాస్ కు ఈ సినిమా చక్కని విజయాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని ఆర్టిస్ట్ లోహిత్ వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!