వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్రం అమ్మేయాలని భావిస్తున్న 13 ఎయిర్‌పోర్టుల్లో 6 పెద్దవి, 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల జాబితాలో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉన్నాయి. చిన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో సేలం (తమిళనాడు), జలగాం (ఛత్తీస్‌గఢ్),…