ఏపీలో మరోసారి మినీపోరుకు రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వరుస ఎన్నికల్లో వైసీపీనే ఏకపక్ష విజయాలు సాధిస్తూ వెళుతోంది. పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ తదితర ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీచింది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి కనీసం పోటీ ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందకు దాదాపు 80నుంచి 90శాతం స్థానాల్లో వైసీపీ ఖాతాలోకే వెళ్లడం విశేషం. అయితే అనివార్య కారణాలతో దాదాపు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి…