గురువారం అర్ధరాత్రి లక్నోలోని దేవా రోడ్డులో కిరణ్, కుందన్ యాదవ్, బంటీ యాదద్, శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఇన్నోవా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో.. ఎదురుగా ఉన్న భారీ ట్రక్కును వ్యాన్ ఢీకొట్టడంతో అందులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.