మొన్న తెలుగు పేపరు … నిన్న హిందీ … ఇవాళ ఇంగ్లీష్ పేపర్ లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం సత్యసాయి జిల్లాకు ప్రాకింది.తాజాగా ఆమడగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. అప్రమత్తం అయిన జిల్లా అధికారుల ఘటన పై విచారణకు ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆమడగూరులో 10గంటల సమయంలో పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ స్థానిక వాట్సప్ గ్రూపులో చక్కర్లు కొట్టింది.స్థానికంగా పేపర్ లీక్ అయిందన్న…
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. జులై నెలలో పరీక్షల నిర్వాహణపై సమీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఉంటుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం తరపు వాదనలు విన్న తరువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా కరోనా విజృంభిస్తుండటంతో వాయిదా వేశారు.…