ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. మరో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్ నుంచి విడిపోయాయి. అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు పార్ట్ లుగా విడిపోయింది.