ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ (బీబీఎన్ఎల్) మరియు బీఎస్ఎన్ఎల్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ విలీనంతో, బీఎస్‌ఎన్ఎల్ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ఉపయోగించి 5.67 లక్షల కిలోమీటర్ల…