మంత్రి నారా లోకేశ్ ప్రాతినిథ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ది పథకం కోసం అదనంగా మరో రూ. 111.కోట్ల కు పైగా నిధుల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు కేటాయింపుల వివరాలతో మున్సిపల్ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సురక్షిత తాగునీరు అందించే పథకం కోసం…