తెలంగాణలో సినిమా ధియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో జూన్ 20 నుండి తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు ఇచ్చేసింది. కానీ ఇక్కడి ఎగ్జిబిటర్స్ లో ఉలుకూ పలుకూ లేదు. అలానే గురువారం నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం జీవో జారీ చేసింది. అంతేకాదు…. ఇంతవరకూ టిక్కెట్ రేట్ల విషయంలో పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కాస్తంత వెసులుబాటు కల్పించబోతోంది. అయినా పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రెండు రాష్ట్రాలలో…