Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Ntv Story Board On Telangana Government Shifts Focus To Panchayat Elections After Jubilee Hills Victory Bc Reservation Debate Continues

Story Board: జూబ్లీహిల్స్ గెలుపుతో సర్కార్ లో జోష్.. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు..

Published Date :November 19, 2025 , 8:57 am
By Sudhakar Ravula
  • బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ....
  • డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం..
  • కేంద్ర ప్రభుత్వం వద్ద, కోర్టుల్లో పెండింగ్లో బీసీ రిజర్వేషన్లు..
  • 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేదు..
  • 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగుస్తుంది..
  • అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులు 3 వేల కోట్లు రావు..
  • పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక కోరాలని తీర్మానం..
  • కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..
  • తెలంగాణలో కొన్ని నెలలుగా స్థానిక ఎన్నికలపై ఊహాగానాలు..
Story Board: జూబ్లీహిల్స్ గెలుపుతో సర్కార్ లో జోష్.. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: తెలంగాణ సర్కార్‌… పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలుపుతో…కాంగ్రెస్‌ పార్టీకి జోష్‌ వచ్చింది. ఇదే ఊపులో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి…రాష్ట్రవ్యాప్తంగా పార్టీబలంగా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్​లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట కేబినెట్​ నిర్ణయించింది. వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మరో వారం లేదంటే పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వద్ద, కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం, మార్చిలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ. 3 వేల కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో కేబినెట్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు.

గ్రామాల్లో పాలన వ్యవస్థ దెబ్బతింటున్నందున వీలైనంత తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చిత్తశుద్ధితో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసినా.. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనందున బిల్లులు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్​లో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగుస్తుందని, అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి. అందుకే ఈ డిసెంబర్​ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాల కోసం డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని తీర్మానం చేసినట్లు పొంగులేటి తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. 42 శాతం రిజర్వేషన్లపై కోర్టులో తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

Also Read

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
  • Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..
  • Story Board: నియోజకవర్గాల పునర్విభజన..! తెలుగు రాష్ట్రాలకు వరమా? శాపమా?

ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించారు. గతంలో డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇచ్చిందని, దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైందన్నారు. అయితే, కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయిందని, ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుందని పొంగులేటి వెల్లడించారు.

తెలంగాణలో కొన్ని నెలలుగా స్థానిక ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీకాలం ఫిబ్రవరిలోనే ముగిసింది. మొదట అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనే చర్చ జరిగింది. కానీ నిర్ణీత గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో.. ప్రక్రియ ఆలస్యం కావచ్చనే అంచనాలు వచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపినా.. అది రాష్ట్రపతికి వెళ్లి అక్కడ పెండింగ్ లో ఉంది. సీఎం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోవడంతో.. ఇక ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కారు భావించింది.

చివరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. హైకోర్టు ఇచ్చిన గడువు లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం విర్ణయం తీసుకుంది. ఒక్కసారి సర్కారు ఫిక్సయ్యాక.. చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. నిజానికి అంతకుముందే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల కోసం ప్రాథమిక కసరత్తును పూర్తిచేసింది. దీంతో పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేకుండానే.. రోజుల వ్యవధిలోనే షెడ్యూల్ విడుదలైంది. మొదట్లో స్థానిక ఎన్నికలు పెట్టడానికి సర్కారు భయపడుతుందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని కూడా సర్కారు దీటుగా తిప్పికొట్టినట్టైంది. స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. అలాగే తన వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కకుండా గుంభనంగా ఉంటూ వచ్చింది. గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ పైనా హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరువాత ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BC reservations Telangana
  • High Court order Telangana elections
  • Jubilee Hills bypoll Congress victory
  • Local Body Elections Telangana
  • NTV Story board

తాజావార్తలు

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!

  • IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!

  • Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..

  • Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions