Story Board: మొంథా తుపాను అన్నదాతలను నిండా ముంచేసింది. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పాలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకూలాయి. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాకపోకలు స్తంభించాయి.
Read Also: iPhone 17 Pro Price Drop: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. 70 వేలకే ఐఫోన్ 17 ప్రో!
మొంథా తుపాను ఏపీ, తెలంగాణని వణికించింది. ఈదురుగాలులతో కుండపోత వర్షం కుమ్మేస్తోంది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. భీకర గాలులకు చరెల్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులకు వరద నీరు పోటెత్తింది. గ్రామాలకు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ఊరు-నీరు ఏకమై…లక్షల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నోటికొచ్చే సమయంలో మొంథా తుపాను.. ముంచెత్తడంతో అన్నదాతల బాధలు వర్ణనాతీతంగా మారాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా…పల్లెలు, పట్టణాలను ఏకం చేసింది. దాదాపు 2 లక్ష హెక్టార్లలో పంటలు ధ్వంసం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పంటలే కాదు…పలు జిల్లాల్లో ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి.
Read Also: Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో కాదు.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఫిక్స్.
రెండు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలోనూ పంటలను వర్షం ముంచెత్తింది. వర్ష బీభత్సానికి పంటలు కకావికలమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. అలాగే లక్షా 45 వేల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా నష్టపోయాయి. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 35వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్నిచోట్లా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేల వాలాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా. విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో సుమారు 7వేల ఎకరాల వరి నేలవాలింది. ఇలా ఏపీలో ఎటుచూసినా వర్షాలకు దెబ్బతిన్న పంటలే.
Read Also: Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి ఫైర్
మొంథా తుపాను ఉదయం నుంచి కృష్ణా జిల్లాను వణికించింది. కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, చల్లపల్లి, కృత్తివెన్ను, గన్నవరం తదితర మండలాల్లో పెద్దఎత్తున చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలులతో ఓ మోస్తరు వాన కురిసింది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులకు కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, చల్లపల్లి, కృత్తివెన్ను, గన్నవరం తదితర మండలాల్లో పెద్దఎత్తున చెట్లు నేలకొరిగాయి. లంక గ్రామాల్లో అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. తోట్లవల్లూరులంక, వల్లూరుపాలెంలంక, పిల్లివానిలంక, పొట్టి దిబ్బలంక, భద్రిరాజుపాలెం, చాగంటిపాడులో అరటిపంట నేలమట్టమైంది. అరటి గెలలు కోసే సమయంలో తుఫాను రావటంతో కోలుకోలేని విధంగా నష్టపోవాల్సి వచ్చింది. ఎకరాకు సుమారు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే…నేలపాలయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినుములు, పదుల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలి దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు, తోట్లవల్లూరు, చల్లపల్లి, మోపిదేవి, పమిడిముక్కల, ఘంటసాల మండలాల పరిధిలో వందల హెక్టార్లలోని అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
Read Also: Tollywood : నవంబర్ ఫస్ట్ హాఫ్ లో హిట్టుకొట్టెదెవరు..?
మొంథా తుఫాన్ ప్రభావం లంక గ్రామాల్లో అరటి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది… కృష్ణానది వరదలతో సగం మంది రైతులు నష్టపోతే మొంతా తుఫాన్ మిగతా రైతులను ముంచేసింది… తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు అరటి రైతులకు శాపంగా మారింది. లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కళ్లముందే నేలపాలవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొంతా తుఫాన్ తమను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భారీ ఎత్తున వృక్షాలు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. భారీగా గాలులు వీస్తుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పలుచోట్ల విద్యుత్తు సరఫరాను అధికారులు నిలిపేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికి అంది వచ్చిన సమయంలో వరిపంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటలు నేలపాలు కావడంతో రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఎకరానికి 30 వేల నుంచి 40 వేల రూపాయలు వరకు నష్టం వాటినట్టు వాపోతున్నారు. ఎకరానికి 40 బస్తాలు వచ్చే దిగుబడి ఇప్పుడు పది నుండి 20 బస్తాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మొంథా కేవలం తీర గ్రామాలనే కాదు కాకినాడ పరిసర ప్రాంతాల రైతుల పంటలనూ తీవ్రంగా దెబ్బతీసింది. లక్షల్లో పెట్టుబడి పెట్టి మరో వారం రోజుల్లో పంట చేతికి వస్తుందనే ఆనందంలో ఉన్న రైతుల ఆశలపై తుఫాన్ దెబ్బతీసిందంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పండ్లు, కూరగాయాలు, అరటి పంటలు మట్టిలో కలిశాయి.
విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెను గాలులకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరప, కాకినాడ రూరల్, పెద్దాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, కాజులూరు తదితర మండలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, వన్నెపూడి తదితర ప్రాంతాల్లో మిరప, అరటి వంటి వాణిజ్య పంటలు దెబ్బ తిన్నాయి. ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్, సుద్దగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయానికి ఎగువ నుండి వరద నీరు పోటెత్తడంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి.
అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస-కిరండూల్ రైల్వే లైన్‌లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. ట్రాక్‌పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ-అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
విజయనగరం జిల్లాలో మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచింది. విస్తారంగా సాగుచేసిన వరి పంట నేలకొరిగింది. గింజ పసుపురంగులోకి మారుతోంది. అక్కడక్కడ మొలకలు వస్తున్నాయి. పంట చేతికొస్తున్న దశలో ఇలా తుడిచిపెట్టుకుపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి, మెరకముడిదాం మండలాల్లో భారీగా నష్టపోయారు వరి రైతులు. వరిపంట ఎక్కడికక్కడ నేలమట్టమైంది.
