ఈ ఏడాది ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ టాలీవుడ్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో నెలలో వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్, తెలుసు కదా చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. ఇక అక్టోబర్ మంత్ ఎండింగ్ నుండే నవంబర్ నెలకు లీడ్ తీసుకున్నాయి బాహుబలి ది ఎపిక్ అండ్ మాస్ జాతర చిత్రాలు. డార్లింగ్ మూవీ సంగతి పక్కన పెడితే వరుస ప్లాపుల్లో సతమతమౌతున్న రవితేజ ఖాకీ షర్ట్ సెంటిమెంట్ నమ్ముకుని మాస్ జాతరతో వచ్చేస్తున్నాడు. అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్లతో రచ్చ రచ్చ చేయనున్నాడు మాస్ మహారాజ్.
Also Read : Raviteja : మాస్ మహారాజ.. ఆ లైనప్ ఏంటి రాజా
ఈ ఏడాది హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలతో జోరు చూపిస్తోన్న మోహన్ లాల్ నుండి రాబోతున్న బై లింగ్వల్ ఫిల్మ్ వృషభ నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కు ఇంకా పట్టుమని పదిరోజులు కూడా లేదు.. కానీ ఎక్కడా ప్రమోషన్ల హడావుడి కనిపించట్లేదు. ఇప్పటికే అక్టోబర్ నుండి నవంబర్‌కు వాయిదా పడ్డ వృషభ అనుకున్న టైంకి వస్తుందో రాదో కూడా అనుమానంగానే ఉంది. కుబేర, థమాతో అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్‌లో జోరు చూపిస్తున్న రష్మిక నుండి రాబోతున్న మిడ్ రేంజ్ ఫిల్మ్ ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7న థియేటర్లలోకి రాబోతోంది. ఇక అదే రోజు జటాధరతో వస్తున్నాడు సుధీర్ బాబు. మా నాన్న సూపర్ హీరో ప్లాప్ తర్వాత సుధీర్ బాలీవుడ్‌లో హీరోగా తేల్చుకునేందుకు రెడీ అవుతుంటే ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక అదే రోజు మసూదతో పాపులరైన తిరువీర్ విలేజ్ డ్రామా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పరేషాన్ ప్లాప్ తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తిరువీర్.. ఈ సినిమా తనకు బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నాడు.