NTV Telugu Site icon

liquor case: ఈడీ ముందుకు కవిత.. ఢిల్లీకి క్యూ కట్టిన మంత్రులు.. ఏం జరగబోతోంది?

Mlc Kavitha

Mlc Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఈడీ విచారణకు వేగవంతం చేసింది. ఈ కేసు సంబంధించిన వ్యక్తులను విచారిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు.

Also Read:MLC Eelctions: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఈ నెల 11న కవితను విచారించింది. దాదాపు 9 గంటలకు పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని అప్పుడే ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. మరో వైపు ఈడీ సమన్లపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఈడీ విచారణ నుంచి తనను మినహాయించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈడీ అధికారులు తనను వేధిస్తున్నారని.. మహిళా హక్కులను కాలరాస్తున్నట్టుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కవిత పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ నేపథ్యంలో కవిత ఈ రోజు మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు.

Also Read: Viral Posters : హైదరాబాద్ లో వాల్ పోస్టర్ల కలకలం.. బీఎల్ సంతోష్ ఫొటో వైరల్..

ఇదిలా ఉంటే.. చెల్లికి తోడుగా ధైర్యంగా ఉండేందుకు మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మొదటిసారి కూడా ఈడీ విచారణకు హాజరైన సమయంలో.. కవితకు అండగా ఉంటేందుకు కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితల మంత్రులు హస్తినకు వెళ్లారు. ఇప్పుడు కూడా కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు కూడా హస్తినకు వెళ్లారు. ఇవాళ్టి ఈడీ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత విచారణ సందర్భంగా ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Show comments