Site icon NTV Telugu

World Cup: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ..

World Cup

World Cup

World Cup: భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్‌లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.

Read Also: Daggupati Prasad: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సవాల్.. ఒక్క సెంట్ భూమి అయినా చూపించండి..!

జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి వర్మలతో పాటు మిగతా క్రికెటర్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. వరల్డ్ కప్ విజయం తర్వాత కొంత మందికి ఫాలోవర్ల సంఖ్య డబుల్, త్రిపుల్ అయింది. దీంతో పాటే వారి ఫీజులు కూడా రెట్టింపు అయ్యాయి. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జెమిమా రోడ్రిగ్స్ ప్రస్తుతం బ్రాండ్ హాట్ ఫెవరెట్‌గా మారింది. జెమియా బ్రాండ్‌ను నిర్వహించే JSW స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత తమకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్‌లు వచ్చాయని, మేము 10-12 విభాగాలలోని బ్రాండ్లతో సంభాషణ జరుపుతున్నట్లు చెప్పారు. నివేదికల ప్రకారం, జెమియా ఇప్పుడు బ్రాండ్ల లాంగివిటీ, డెలివరీలను బట్టి రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఫీజులు వసూలు చేస్తుంది.

దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, రెక్సోనా డియోడరెంట్, నైక్, హ్యుందాయ్, హెర్బాలైఫ్, ఎస్‌బీఐ, గల్ఫ్ ఆయిల్, పీఎన్బీ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ తో సహా 16 బ్రాండ్లకు ఎండార్స్మెంట్ చేస్తోంది. వీటి ద్వారా ఆమె రూ. 1.5 కోట్ల-2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమచారం. హర్మన్ ప్రీత్ కైర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ లను బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగింది.

Exit mobile version