Women’s T20 World Cup 2026: మరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఏకంగా ఏడోసారి టీ20 ప్రపంచకప్!
- మరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా
- ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన ఆసీస్
- ఏకంగా ఏడోసారి టీ20 ప్రపంచకప్ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia vs England Final: ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి.. మహిళల టీ20 ప్రపంచకప్ 2026ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో రికార్డు స్థాయిలో ఏడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఆసీస్ సొంతం చేసుకుంది. బెత్ మూనీ అద్భుత అర్ధశతకం, ఫోబీ లిచ్‌ఫీల్డ్ మెరుపు ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే ఛేదించి.. ఆసీస్ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. కిమ్ గార్త్, లూసీ హామిల్టన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ 70 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ (58 నాటౌట్), ఫ్రేయా కెంప్ (44 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారు. ఈ ఇద్దరి ప్రదర్శనలతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
Also Read
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం దక్కలేదు. అయితే బెత్ మూనీ, ఫోబీ లిచ్‌ఫీల్డ్ మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 67 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఆశలపై దెబ్బ కొట్టారు. బెత్ మూనీ 38 బంతుల్లో 64 పరుగులతో చెలరేగగా.. ఫోబీ లిచ్‌ఫీల్డ్ 35 బంతుల్లో 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. లిచ్‌ఫీల్డ్, మూనీ అయినప్పటికీ అప్పటికే మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎల్లిస్ పెర్రీ (13), యాష్లీ గార్డనర్ (3) మిగతా పని పూర్తి చేశారు. చివరలో ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ఐదు వైడ్లతో ఆస్ట్రేలియా విజయం అందుకుంది. ఈ విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా ఏడోసారి ఛాంపియన్‌గా నిలిచి తన రికార్డును మరింత పదిలం చేసుకుంది.
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..