Womens IPL: నేడే విమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రకటన..రేసు నుంచి సీఎస్కే ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 ఏళ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది డబుల్ కిక్కిచ్చేందుకు రెఢీ అయింది. ఇప్పటికే పురుషుల లీగ్ ఫ్యాన్స్‌కు మజా ఇస్తుండగా ఈ ఏడాది మహిళల లీగ్ కూడా ప్రారంభంకానుంది. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. అయితే, బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న విమెన్స్ ఐపీఎల్‌లో నేడు (జనవరి 25) కీలక ప్రక్రియ జరగబోతోంది. ఈరోజే విమెన్స్ ఐపీఎల్ టీమ్స్‌లను ప్రకటించనుంది. ఇప్పటికే కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీసీసీఐ మరింత సంపన్నం కానుంది. ఇదివరకే టెండర్లను ఆన్‌లైన్‌లో ఉంచగా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి బిడ్‌లను స్వీకరించిన బీసీసీఐ..నేడు ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఐదు టీమ్స్‌ను ప్రకటించనుంది.
Pathan Review: పఠాన్ మూవీ రివ్యూ (హిందీ)
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
టెండర్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 21తో ముగిసింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఐదు టీమ్స్ కోసం 33 బిడ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో పురుషుల ఐపీఎల్‌కు చెందిన పది ఫ్రాంచైజీలు టెండర్లను కొనుగోలు చేశాయి. అయితే మొత్తంగా ఇప్పటిదాకా టెక్నికల్ బిడ్స్‌ను దాఖలు చేసినవి మాత్రం 17 మాత్రమే. ఆన్‌లైన్‌లో టెండర్లను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ టెక్నికల్ బిడ్స్ దాఖలు చేయలేదని సమాచారం. ఈ మూడు తప్ప మిగిలిన ఏడు ఫ్రాంచైజీలు పోటీలో ఉన్నాయి. మొత్తంగా 17 సంస్థలు టెక్నికల్ బిడ్స్‌ను సమర్పించగా.. వాటిలో 14 బిడ్స్‌కు బీసీసీఐ ఆమోదం కూడా తెలిపిందట. బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఐదు టీమ్‌లను కొనుగోలు చేసేందుకు ఏడు ఐపీఎల్ టీమ్స్‌తోపాటు హల్దీరామ్స్, శ్రీరామ్ గ్రూప్, అదానీ గ్రూప్, కొటక్, ఏపీఎల్ అపోలో, స్లింగ్ షాట్ రూట్ మొబైల్‌లు కూడా పోటీలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఐదు టీమ్స్‌కు గానూ ఒక్కో జట్టు సుమారు రూ.600 నుంచి రూ.800 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఫైనాన్షియల్ బిడ్‌ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత బీసీసీఐ.. దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ వేలం ద్వారా బీసీసీఐ సుమారు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఆర్జించే వీలుందని విశ్లేషకుల అంచనా.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!