టీమిండియా క్రికెటర్ల పై గ్యాంగ్ రేప్ ఆరోపణలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ప్లేయర్స్ హార్థిక్ పాండ్యా, మునాఫ్ పటేల్‌తో పాటు, బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్‌శుక్లాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిందో మహిళ. ముగ్గురు తనపైన లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసా? అండర్‌వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య. ఫొటోలో కనిపిస్తున్న ఇతనే రియాజ్ భాటీ. అండర్‌వాల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అనుచరుడు. డాన్‌కు అనుచరుడైనా మహారాష్ట్రలోని వీఐపీలంతా రియాజ్‌కు సుపరిచుతులే. రియాజ్‌పై ఇప్పుడతని భార్య రెహ్నూమా భాటీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది మామూలు ఫిర్యాదు కాదు.. పెద్దపెద్ద వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తన భర్త రియాజే బలవంతంగా తనను వీఐపీల దగ్గరకు పంపించాడని ఫిర్యాదులో పేర్కొంది. రెహ్నూమా ఫిర్యాదు కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రెండు నెలలుగా కేసుకట్టమని వేడుకుంటున్నా ముంబై పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది రెహ్నూమా. రెహ్నూమా ఫిర్యాదులో క్రికెట్ స్టార్స్ హార్థిక్ పాండ్యా, మునాఫ్ పటేళ్ల పేర్లతో పాటు, బీసీసీఐ మాజీ చీప్ రాజీవ్‌శుక్లా పేరుకూడా ఉంది. ఈ ముగ్గురి దగ్గరకు తన భర్త రియాజ్ బలవంతంగా పంపించాడన్నది రెహ్నూమా ఆరోపణ. ముంబై ట్రైడెంట్ హోటల్లో హార్థిక్ పాండ్యా, అతని ఇద్దరు స్నేహితులు, కాంటినెంటల్ హోటళ్లో మునాఫ్ పటేల్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె రాసిన ఫిర్యాదు కాపీలో ఉంది.
Also Read
- Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
- Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్‌శుక్లా, అతని స్నేహితులు లైంగిక దాడిచేయడంతో పాటు, చిత్రవధకు గురి చేశారని ఆమె పోలీసులకిచ్చిన కంప్లైంట్లో తెలిపింది రెహ్నూమ. తన భర్త రియాజ్ భాటీ హై లెవల్ సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని, అనేక మంది బిజినెస్మెన్లు, హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల దగ్గరకు తనను బలవంతంగా పంపించాడని ఆరోపిస్తున్నారు రెహ్నూమ. సెంప్టెబర్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమెదు చేయలేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటు ముంబై పోలీసుల మాత్రం ఇప్పటికే రెహ్నూమా ఫిర్యాదుపై కేసుకట్టారు. ఆమె ఆరోపించినట్టుగా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. రెహ్నూమ ఫిర్యాదు ఇటు క్రికెట్ వాల్డ్, అటు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!