Site icon NTV Telugu

Rishabh Pant: రిషభ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇదే!

Pant

Pant

Rishabh Pant: టీమిండియా ప్రస్తుతం గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌ ఆడుతుంది. కోల్‌కతా టెస్ట్‌లో శుభ్‌మన్‌ గిల్‌ మెడనొప్పితో స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత ఈ సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు. దీంతో రెండో టెస్ట్‌కు పంత్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, వన్డే సిరీస్‌కు కూడా గిల్‌ లేకపోవడంతో సారథ్య బాధ్యతలను కేఎల్‌ రాహుల్‌కు అప్పగించింది జట్టు మేనేజ్మెంట్. అలాగే, రిషభ్‌ పంత్‌కు వన్డే జట్టులో చోటు దొరికినప్పటికీ కెప్టెన్సీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకు కెప్టెన్సీ ఇవ్వలేదనే అంశంపై అభిమానులు, క్రికెట్‌ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!

అయితే, నవంబర్‌ 30వ తేదీ నుంచి సఫారీతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన టీంను బీసీసీఐ ఆదివారం నాడు ప్రకటించింది. రిషభ్‌ పంత్‌ గత సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అందుకే, కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అలాగే, గాయపడిన గిల్‌ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ (జనవరి 2026) నాటికి అందుబాటులోకి రానున్నట్లు బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలియజేశారు. ప్రోటీస్ తో వన్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌కు రెస్ట్ ఇచ్చింది. భారత్‌-ఏ తరఫున దక్షిణాఫ్రికా-ఏపై అద్భుత ప్రదర్శన చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌ను వన్డే టీంలోకి తీసుకున్నారు.

Read Also: Pakistan: పాక్‌ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి

టీమిండియా వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, జైస్వాల్, విరాట్‌ కోహ్లీ, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్, వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, కుల్‌దీప్‌ యాదవ్, నితీశ్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్ గైక్వాడ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌.

Exit mobile version