Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
- ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో సూర్యవంశీకి దక్కని ఛాన్స్
- ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ
- అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Didn’t Vaibhav Sooryavanshi Debut: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై వస్తున్న విమర్శలకు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే స్పందించాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడే సామర్థ్యం వైభవ్‌కు పూర్తిగా ఉందని స్పష్టం చేసిన ఆయన.. జట్టులోని మిగతా ఆటగాళ్ల మాదిరిగానే అతడు కూడా తన అవకాశానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించాడు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 0-2తో వైట్‌వాష్‌కు గురైన తర్వాత బుడ్డోడిని ఆడించకపోవడంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టెన్ డస్కాటే స్పందించాడు.
టాప్ ఆటగాళ్లు ఉన్నారు:
‘వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. కానీ మూడు నెలల క్రితమే టీ20 ప్రపంచకప్ 2026 గెలిపించిన జట్టులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి టాప్ ఆటగాళ్లు ఉన్నారు. వారికి కూడా సరైన అవకాశాలు ఇవ్వడం మా బాధ్యత. ఐపీఎల్ 2026లో సంజు బాగా ఆడాడు. ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం కల్పించాలంటే వారికి వరుస అవకాశాలు ఇవ్వాలి. ఒక మ్యాచ్‌తోనే నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. మేమంతా వైభవ్ ఆడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. కానీ మిగతా ఆటగాళ్లు అనుసరించిన విధానాన్నే అతడూ అనుసరించాలి’ అని టెన్ డస్కాటే స్పష్టం చేశాడు.
Also Read
- Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
- Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
- Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
- Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
ఐపీఎల్లో సంచలన ప్రదర్శన:
ఈ ఏడాది ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. టాప్ బౌలర్లను కూడా ఓ ఆటాడుకున్నాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. బుడ్డోడి సునామి ఇన్నింగ్స్‌లకు అందరూ ఫిదా అయ్యారు. 230కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’, ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో అరంగేట్రం?:
జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పర్యటనలో భారత జట్టు తరఫున అరంగేట్రం చేస్తే.. 16 ఏళ్ల వయసులో డెబ్యూ చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించనున్నాడు. భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!