WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL Auction Youngest Player Uma Kashvi: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 వేలంలో కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల యువ క్రికెటర్ ఉమా కాశ్వి అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. గత ఏడాది 16 ఏళ్ల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన దియా యాదవ్ పేరిట ఉన్న రికార్డును ఉమా అధిగమించింది. చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ ఆల్‌రౌండర్.. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది.
ఎవరీ ఉమా కాశ్వి?:
కర్ణాటకకు చెందిన ఉమా కాశ్వి రైట్ హ్యాండ్ బ్యాటర్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలదు. ఇటీవల బీసీసీఐ నిర్వహించిన మహిళల అండర్-15 వన్డే టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. 172 సగటుతో 516 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఈ గణాంకాలే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఉమా భారత అండర్-19 జట్టు తరఫున శ్రీలంక అండర్-19 జట్టుతోనూ ఆడింది. మూడు టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు వన్డే మ్యాచ్‌ల్లో మరో రెండు వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగల సామర్థ్యం ఉండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను జట్టులోకి తీసుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
- WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
- RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
- WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
సోఫీ మోలిన్యూకు అత్యధిక ధర:
కొచ్చిలో బుధవారం జరిగిన డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలిన్యూ అత్యధిక ధర పలికింది. ఆమెను యూపీ వారియర్జ్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె బేస్ ప్రైస్ రూ.50 లక్షలు కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా రూ.1.05 కోట్ల వరకు పోటీపడింది. చివరకు ఆర్సీబీ తప్పుకోవడంతో సోఫీ యూపీ సొంతమైంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సోఫీ.. గతంలో ఆర్సీబీ తరఫున ఆడి టైటిల్ సాధించడంలో భాగమైంది. గాయం కారణంగా 2026 డబ్ల్యూపీఎల్ సీజన్‌కు దూరమైన ఆమె.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చింది. 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఆమెకు ఉంది.
కిరణ్ నవ్‌గిరేకు రూ.75 లక్షలు:
భారత బ్యాటర్ కిరణ్ నవ్‌గిరేను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆమె కోసం ముంబై ఇండియన్స్ కూడా పోటీపడగా.. రూ.70 లక్షల వద్ద వెనక్కి తగ్గింది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో కిరణ్ రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు 2025 అండర్-19 ప్రపంచకప్ విజేత భారత జట్టులో సభ్యురాలైన యువ వికెట్‌కీపర్ బ్యాటర్ జి. కమలినిని గుజరాత్ జెయింట్స్ రూ.40 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది.
గంటలోపే ముగిసిన మినీ వేలం:
డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలంలో మొత్తం 25 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. తక్కువ వ్యవధిలోనే వేలం ముగియగా.. యూపీ వారియర్జ్ అత్యధికంగా ఎనిమిది మంది ఆటగాళ్లను తీసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మాత్రం సోఫీ మోలిన్యూ కోసం పోటీపడి.. చివర్లో తమ కొనుగోళ్లను పూర్తి చేసింది. మొత్తంగా ఉమా కాశ్వి వంటి యువ ప్రతిభావంతులకు డబ్ల్యూపీఎల్ వేదికగా అవకాశం లభించగా.. సోఫీ మోలిన్యూ, కిరణ్ నవ్‌గిరే వంటి ఆటగాళ్లు భారీ ధరలు పలికారు.
తాజావార్తలు
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
-
Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..