జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ పదవి మన క్రికెట్ జట్టుకు చాలా కీలకం అనేది తెలిసందే. ఏ ఆటగాడు అయిన జాతీయ జట్టులో ఆడాలి అంటే అతను ఫిట్నెస్ ను ఇక్కడ ఎన్‌సీఏ లోనే నిరూపించుకోవాలి. ఎన్‌సీఏ పెట్టె అన్ని పరీక్షలో పాస్ అయిన ఆటగాడు మాత్రమే టీం ఇండియాలో ఆడుతాడు. అయితే ఇన్ని రోజులు ఎన్‌సీఏ హెడ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా మారిన విషయం తెలిసిందే. ఎన్‌సీఏ హెడ్ స్థానంలోకి వీవీఎస్ లక్ష్మణ్ వస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేసారు. అయితే తాజాగా ఎన్‌సీఏ హెడ్ గా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించాడు. ఆ ఆవిషయాన్ని తెలియజేస్తూ… మొదటి రోజు తన ఆఫీస్ లోని ఫోటోలను ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. ఇది తనకో కొత్త ఛాలెంజ్ అని…భారత క్రికెట్ తో కలిసి పనిచేయడం గురించి ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు వీవీఎస్.