విరాట్ కోహ్లీ భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్సీని వదులుకోవద్దని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ 2021 లో భారత్ కథ ముగిసిన తరువాత కోహ్లీ ఈ పొట్టి ఫార్మటు లో కెప్టెన్‌గా కోహ్లీ పదవీకాలం ముగిసింది. అయితే మరో రెండు రోజుల్లో జాతీయ సెలెక్టర్లు సమావేశమైనప్పుడు వన్డే కెప్టెన్ గా కోహ్లీ భవిష్యత్తుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ వన్డే కెప్టెన్సీని కోల్పోయే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.
దీని పై సెహ్వాగ్ స్పందిస్తూ… టీ20 లో కెప్టెన్ గా తప్పుకోవాలి అనేది విరాట్ నిర్ణయం, కానీ అతను మిగిలిన రెండు ఫార్మాట్ల కెప్టెన్సీని విడిచి పెడతాడు అని నేను అనుకోను. ఒకవేళ అలా అనుకోని… అతను కేవలం ఆటగాడిగా ఆడాలనుకుంటే… అది అతని నిర్ణయం. కానీ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు బాగా ఆడుతున్నట్లు నేను భావిస్తున్నాను. కెప్టెన్‌గా కోహ్లీ చాలా తెలివైనవాడు. అందుకే అతను వన్డే, టెస్ట్ ల కెప్టెన్ గా కొనసాగాలని భావిస్తున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు.