Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli’s Message to Young Players: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్కులతో 139 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (110; 108 బంతుల్లో 13×4, 1×6) కూడా చెలరేగడంతో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఘన విజయం అందించిన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం తన కెరీర్, ప్రస్తుత మానసిక స్థితి, యువ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన సలహాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నప్పటికీ.. తాను ప్రస్తుతం ఉన్న స్థితిని ఎంతో కృతజ్ఞతతో ఆస్వాదిస్తున్నానని కోహ్లీ చెప్పాడు.
‘నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా, కృతజ్ఞతగా అనిపిస్తుంది. ప్రపంచంలో పేరు, ప్రఖ్యాతి, అభిమానుల ప్రేమ, ఒత్తిళ్ల మధ్య మేము ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలనే కలతో మొదలైన నా ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. నేను ఎంత అదృష్టవంతుడినో అర్థమవుతుంది. భారత్ తరఫున ఆడడం గొప్ప గౌరవం. ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌లు ఆడటం, జట్టు కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తించడం నాకు ఎంతో ప్రత్యేకం. ఒకవేళ నేను భారత జట్టుకు ఆడే అవకాశం దక్కకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రస్తుతం దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఇలాంటి అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నందుకు నా హృదయం ఉప్పొంగుతోంది. బీసీసీఐ, అభిమానులకు నా కృతజ్ఞలు’ అని కింగ్ తెలిపాడు.
Also Read
- IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
- Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
‘నా తల దించుకుని కష్టపడుతూ ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగాలనుకుంటున్నా. నా ఆటతో ఇతరుల ముఖాల్లో కూడా చిరునవ్వు తీసుకురావాలని కోరుకుంటున్నా. కెరీర్లో ఈ దశలో కూడా ఆటను ఆస్వాదిస్తూ, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా టార్గెట్. యువ క్రికెటర్లు మైదానం బయట జరిగే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. తాము ఎందుకు క్రికెట్ ఆడటం ప్రారంభించారో ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. యువ ఆటగాళ్లు గెలుపు కోసం తమ శక్తినంతా ఉపయోగించాలి. ఆటలో రిస్క్ తీసుకోవడం, సానుకూల దృక్పథంతో ఆడటం వల్లే విజయాలు వస్తాయి. మైదానంలోకి వెళ్లిన తర్వాత క్రికెట్‌నే అన్నింటికంటే ముఖ్యంగా భావించాలి. జట్టు కోసం మీ శరీరాన్ని కూడా పణంగా పెట్టి ఆడాలి. బ్యాటింగ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా ఎంత కష్టమైనా పరుగులు చేయాలి. మీరు 150 పరుగులు చేసినా కూడా ఒక ఓవర్లో అసవరం అయితే నాలుగు డబుల్స్ పరుగెత్తాలి. అవకాశం ఉంటె తప్పకుండా పరుగెత్తాలి. ఎలాంటి సాకులు చెప్పకూడదు’ అని యువ ఆటగాళ్లకు సందేశాన్ని ఇచ్చాడు.
తాజావార్తలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!