NTV Telugu Site icon

Virat Kohli: ఊరికే అయిపోరు గొప్పోళ్ళు.. మహమ్మద్ షమీ తల్లి పాదాలను తాకి.. ఆశీర్వాదం తీసుకున్న కోహ్లీ

Kohli

Kohli

ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. దుబాయ్‌లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సాధించిన రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌లను భారత్ అధిగమించింది. ఛాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది తన భార్యను హగ్ చేసుకున్న వీడియో అనుకుంటే పొరపాటే.. మరి ఇంతకంటే స్పేషల్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో మహమ్మద్ షమీకి సంబంధించినది. ఎందుకంటే విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత మహమ్మద్ షమీ కుటుంబాన్ని కలిశాడు. ఈ సందర్భంగా షమీ తల్లి పాదాలను తాకి కోహ్లీ ఆశీర్వాదం తీసుకున్నాడు.

Also Read:SLBC Tragedy: 17వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు

ప్లేయర్స్ తోటి ఆటగాళ్ల కుటుంబాలను కలవడం కామన్. విరాట్ కోహ్లీ తోటి ఆటగాడు మహ్మద్ షమీ తల్లిని కలిసి, ఆమె పాదాలను తాకి, ఆమెతో ఫోటోలు దిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ ఊరికే అయిపోయరు గొప్పోళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ప్రజెంటేషన్ తర్వాత పేసర్ మహమ్మద్ షమీ విరాట్ కోహ్లీని తన తల్లి కలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Also Read:Lok sabha: నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. హాట్‌హాట్‌గా సాగే అవకాశం

వెంటనే విరాట్ షమీతో కలిసి తన తల్లి దగ్గరకు వచ్చి ఆమె పాదాలను తాకాడు. తరువాత షమీ తల్లి, అతని కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ పెద్దలను గౌరవిస్తాడు. తోటి ఆటగాళ్ల తల్లిదండ్రులను కలిసినప్పుడు వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటుంటాడు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ స్టేడియంలో తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే.