Site icon NTV Telugu

Virat Kohli: తాలిబాన్ లీడర్ నుంచి విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన..

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్‌కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు.

Read Also: Boycott IND vs PAK: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్లోకి బాయ్‌కాట్ భారత్- పాక్ మ్యాచ్

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఆశ్చర్యపరిచిందని, కోహ్లీ 50 ఏళ్లు వచ్చే వరకు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు హక్కానీ అన్నారు. ‘‘రోహిత్ టెస్ట్‌ల నుండి రిటైర్మెంట్ సమర్థనీయమే. కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణం నాకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది మాత్రమే అంత ప్రత్యేకమైనవారు. అతను 50 ఏళ్లు వచ్చే వరకు ఆడటానికి ప్రయత్నించాలని నా కోరిక’’ అని హక్కానీ శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కోహ్లీ భారత మీడియాతో నిరాశ చెందవచ్చని, అతడికి ఇంకా ఆడే సమయం ఉందని, సచిన్ టెండూల్కర్ టెస్ట్ పరుగులను జో రూట్ వెంబడించడం మీరు చూడొచ్చు అని హక్కానీ అన్నారు.

36 ఏళ్ల కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌ను మే 12, 2025న ముగించాడు, 10,000 టెస్ట్ పరుగుల మైలురాయిని కేవలం 770 పరుగుల తేడాతో చేరుకోలేకపోయాడు. రోహిత్ శర్మ కోహ్లీకి 5 రోజుల ముందు మే7, 2025న టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. వీరిద్దరి రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీని 25 ఏళ్ శుభమాన్‌గిల్‌కు అప్పగించారు. ప్రస్తుతం, కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే ఆడనున్నారు. అక్టోబర్ లో భారత్ మూడు వన్డేల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తోంది. ఆ సమయంలో ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ మరోసారి మైదానంలో కనిపించనున్నారు.

Exit mobile version