Virat Kohli: అదే కథ.. అదే వ్యధ.. పరిష్కారమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైంది అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ అవుట్ కాగా.. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం అయ్యింది. కోహ్లీ ప్రదర్శన చూసి అతడి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు, ఎలా ఉండే కోహ్లీ ఇలా అయిపోయాడేంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టిన ఆటగాడు ఇతడేనా అని ప్రశ్నిస్తున్నారు.
కోహ్లీ ప్రస్తుత ప్రదర్శన, అతడిపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా.. కొన్ని రోజులు కోహ్లీ రెస్ట్ తీసుకోవాలంటూ పలువురు క్రికెట్ దిగ్గజాలు సూచిస్తున్నారు. ఇటీవల మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం కోహ్లీకి రెస్ట్ అవసరం అని చెప్పగా.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లలో మంచి ప్రదర్శనే నమోదు చేస్తున్నాడు కానీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రం తన టచ్ కోల్పోతున్నాడని జాఫర్ చెప్పాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ ఒత్తిడికి లోనుకాకుండా తనను తాను కాస్త రిలీఫ్ చేసుకోవడానికి ఒకటి లేదా రెండు నెలలు విశ్రాంతి తీసుకుని రిలాక్స్‌గా మళ్లీ ఆట మొదలుపెట్టాలని సూచించాడు. కోహ్లీ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒక్క సెంచరీ లేకుండా 100 ఇన్నింగ్స్‌లు ఆడాడని.. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేయర్‌గా పేర్కొనే కోహ్లీ లాంటి ఆటగాడికి ఇది మింగుడుపడని విషయంగా మారిందని జాఫర్ పేర్కొన్నాడు.
Also Read
- BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్‌లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
- Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్‌పై వేటు?
- Harry Brook: "టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే".. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్‌లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
Hardik Pandya: తిరిగి టీమిండియాలోకి రావడం నా చేతుల్లో లేదు.. ఐపీఎల్‌పైనే నా దృష్టి
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!