Team India: మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంటిమెంట్ అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. అక్టోబర్‌లో మ్యాచ్‌లు అంటే కోహ్లీకి పూనకం వస్తుందని.. ముఖ్యంగా 2011 నుంచి 2021 వరకు అక్టోబర్ 21-24 మధ్య తేదీల్లో టీమిండియా మ్యాచ్ ఆడితే విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు మ్యాచ్ జరిగే తేదీ అక్టోబర్ 23 కాబట్టి తమ స్టార్ చెలరేగిపోవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడని భావిస్తున్నారు.
Read Also: IND Vs PAK: మెల్‌బోర్న్ వద్ద రచ్చ రచ్చ.. స్విమ్మింగ్ పోటీలైనా నిర్వహించాలని ఫ్యాన్స్ వినతి
గతంలో అక్టోబర్ 21న విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ ఆడగా 22వ తేదీ రెండు మ్యాచ్‌లు, 23వ తేదీ రెండు మ్యాచ్‌లు, 24వ తేదీ ఒక మ్యాచ్ ఆడాడు. ఆయా మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ దాదాపుగా సెంచరీతో చెలరేగాడు. 2011 అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులు నాటౌట్, 2015న అక్టోబర్ 22న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులు, 2016 అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగులు, 2017 అక్టోబర్ 21న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 140 పరుగులు, 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 పరుగులు నాటౌట్ స్కోర్లను విరాట్ కోహ్లీ చేశాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు విఫలమైన వేళ విరాట్ కోహ్లీ ఒక్కడే 57 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో ఈరోజు జరిగే మ్యాచ్‌లోనూ కోహ్లీ రాణిస్తాడని అతడి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
